Asianet News TeluguAsianet News Telugu

నాయీ బ్రాహ్మణుల గురించి కేసిఆర్ ఇలా అన్నారు

  • నాయి బ్రాహ్మణుల గురించి కేసిఆర్ కామెంట్
  • బిసిల సేవలను కొనియాడిన కేసిఆర్
Kcr praises the services of nai Brahmans

నాయీ బ్రాహ్మణుల గురించి తెలంగాణ సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారి సేవలను కొనియాడుతూ పంచ్ డైలాగ్ విసిరారు. ఆ పంచ్ డైలాగ్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

శనివారం ప్రగతి భవన్ లో బిసి కులాల అభ్యున్నతిపై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా బిసి కులాలు సమాజానికి చేస్తున్న సేవలను వివరించారు. కేసిఆర్ ఇలా అన్నారు‘‘బిసి కులాలు ప్రధానంగా వృత్తి దారుల కుటుంబాలు. వారు చేసే పని మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. వారు లేకుంటే సమాజం ఈ పరిస్థితిలో ఉండదు. రజకులు బట్టలు ఉతకకపోతే పరిశుభ్రంగా ఉండడం సాధ్యం కాదు.

నాయీ బ్రాహ్మణులు క్షవరం చేయకుంటే మనుషులు గుడ్డేలుగుల్లా ఉంటారు. మేదరులు అల్లిన వస్తువులు ప్రతీ ఇంట్లో వాడతారు. మేరలు కుట్టిన బట్టలు తొడుక్కుంటాం. కంసాలి, వడ్రండి, కమ్మరి, కుమ్మరి.. ఇలా ప్రతీ కుల వృత్తి దారులు సమాజం కోసమే పనిచేస్తున్నారు.

ఆయా పనులు చేయడం వల్ల వారు ఉపాధి పొందుతుండవచ్చు కానీ, వారి కృషి వల్ల మానవ సమాజం ఉన్నతంగా బతుకుతున్నది. కాబట్టి యావత్ సమాజం కులవృత్తుల వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు ఇప్పటికే చేపట్టింది అని కేసిఆర్ వివరించారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios