సుఖేందర్ రెడ్డి పై కేసిఆర్ సరదా వ్యాఖ్యలు

తెలంగాణ సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రగతిభవన్ లో పాడి రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లాకు చెందిన పాడి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు.

అయితే సమావేశంలో సిఎం కేసిఆర్ మాట్లాడుతూ ‘‘గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరు నెలల సంది నాయెంట పడ్డడు అయినా అనంగనే కాదు గదా అని నేను చెప్పిన. కొందరనుకుంటరు.. సిఎం తలుసుకుంటే కాదా అని కానీ సిఎం తలుసుకున్నా దేనికైనా ఒక ప్రొసీజర్ అంటూ ఉంటది’’ అని కేసిఆర్ వ్యాఖ్యానించారు.

సిఎం ఎందుకోసం ఆరు నెలల సుఖేందర్ రెడ్డి వెంట పడ్డ ముచ్చట చెప్పిర్రంటే విజయ డైరీకి రైతులకు పెంచిన మాదిరిగానే మదర్ డైరీ రైతాంగానికి కూడా ప్రోత్సాహక ధర పెంచాలని సుఖేందర్ రెడ్డి ఆరు నెలల నుంచి అడుగుతున్నడట.

అదే విషయాన్ని సిఎం కేసిఆర్ ప్రగతిభవన్ సభలో సరదాగా వ్యాఖ్యానించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి