హ్యాట్రిక్ కోసం కేసీఆర్: ఫామ్‌హౌస్ లో రాజశ్యామల యాగం, సెంటిమెంట్ ఫలించేనా?

ఎన్నికల ముందు  తెలంగాణ సీఎం రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడ  ఈ యాగం నిర్వహించి  అధికారాన్ని దక్కించుకున్నారు.ఈ దఫా కూడ అధికారం కోసం కేసీఆర్ మరోసారి యాగం నిర్వహిస్తున్నారు. 

KCR  Performs  Rajashyamala Yagam for Victory  in Telangana Assembly elections  2023 lns

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  తన వ్యవసాయ క్షేత్రంలో  బుధవారంనాడు  ఉదయం  రాజశ్యామల యాగం నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ  కేసీఆర్ రాజశ్యామల యాగం  నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మూడో సారి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో  రాజశ్యామల యాగానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.  

2014 ఎన్నికల తర్వాత  తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  మూడు దఫాలు కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు. 2018 ఎన్నికలకు ముందు  తన వ్యవసాయక్షేత్రంలో  రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ నిర్వహించారు.ఈ యాగం పూర్తి చేసుకున్న తర్వాత  నేరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ఎన్నికల ప్రచారానికి  వెళ్లారు కేసీఆర్.  ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండే  కేసీఆర్  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. 

ఏ పని చేయాలన్న మంచి ముహుర్తాన్ని కేసీఆర్ చూసుకుంటారు. నామినేషన్ దాఖలు చేసే సమయంతో పాటు  ఎన్నికల ప్రచారం  నిర్వహించే సమయాలపై కూడ ముహుర్తాలు చూసుకుంటారు. కేసీఆర్ కు భక్తి కూడ ఎక్కువేనని ఆయన  సన్నిహితులు చెబుతుంటారు. అందుకే  ధైవ కార్యక్రమాల్లో కూడ  కేసీఆర్ విరివిగా పాల్గొంటారు.

2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు  పట్టం కట్టారు. ఆ తర్వాత  2015 లో తన ఫామ్ హౌస్ లో కేసీఆర్  రాజశ్యామల యాగం నిర్వహించారు. విశాఖపట్టణం  శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం నిర్వహించారు.  ఈ యాగంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన పలువురు  వైధికులు పాల్గొన్నారు.

also read:నేటినుంచి మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం.. కారణం అదేనా?!

2018లో  అసెంబ్లీని నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే  కేసీఆర్ రద్దు చేశారు.  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత  తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు.  రాజశ్యామల యాగం ముగించుకున్న తర్వాత  వైధికుల  ఆశీర్వచనాలు తీసుకుని  ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. తన ఫామ్ హౌస్ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ప్రచారాన్నికేసీఆర్ ప్రారంభించారు. 

తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల  30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టి హ్యాట్రిక్ సాధించాలని కేసీఆర్  పట్టుదలగా ఉన్నారు. దీంతో  మరోసారి రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు.  ఇప్పటికే  ఎన్నికల ప్రచార సభల్లో  కేసీఆర్ విస్తృతంగా పాల్గొంటున్నారు. ప్రతి రోజూ  మూడు ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.  ఇవాళ  తెల్లవారుజామునే కేసీఆర్ రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. యాగంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం కేసీఆర్  ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.

రాజశ్యామల యాగం చేస్తే  మంచి జరుగుతుందని వైధికులు చెబుతున్నారు. ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి ఈ యాగం దోహదపడుతుందని  చెబుతుంటారు. రాచరిక వ్యవస్థలో  ఒక రాజ్యంపై  మరో రాజు యుద్ధానికి వెళ్లే సమయంలో ఈ యాగం చేసేవారని చరిత్ర చెబుతుంది.  తెలంగాణ సీఎం కేసీఆర్  గత కొంతకాలంగా చంఢీయాగం, రాజశ్యామల యాగాలు నిర్వహిస్తున్నారు.  ఎన్నికలకు ముందు ఈ యాగాలను కేసీఆర్  నిర్వహిస్తున్నారు.

2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత  సహస్ర చంఢీయాగం నిర్వహించిన విషయం తెలిసిందే.  గతంలో న్యూఢీల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం సమయంలో కూడ  ఈ యాగం నిర్వహించారు కేసీఆర్.  ఎన్నికల ముందు  రాజశ్యామల యాగం నిర్వహిస్తే  ప్రయోజనం కలుగుతుందనే సెంటిమెంట్ తో మరోసారి యాగం చేస్తున్నారు గులాబీ బాస్.  ఈ సెంటిమెంట్ ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో  డిసెంబర్ 3న తేలనుంది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios