కురవి స్వామి తెలంగాణా మొక్కుతీర్చుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మహబూబాబాద్‌లోని కురవి వీరభద్రస్వామికి తన తెలంగాణా మొక్కు తీర్చుకున్నారు. 

ఈ రోజు (శివరాత్రి) నుంచి ప్రారంభమయ్యే జాతర సందర్భంగా ఆయన ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కురవి సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇది 15 సంవత్సరాల కిందటి మొక్కు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమీసాలు సమర్పిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001లో మొక్కుకున్నారట. 

తిరుమల కాన్కల వివాదం రగులుతూ ఉన్నా ఈ రోజు రూ.62,908 ఖర్చుతో స్వామివారికి 20.28 గ్రాముల బంగారు మీసాలు చేయించి కెసిఆర్ ఆమొక్కు తీర్చుకున్నారు.