తెలంగాణ సిఎం కేసిఆర్ పదవుల కోసం పాకులాడే మనిషి కాదని స్పష్టం చేశారు నిజామాబాద్ ఎంపి కవిత. మార్పు దిశగా దేశాన్ని నడిపించేందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని తెలిపారు. నల్సార్ యూనివర్సిటీ సెంటర్ ఫేర్ మేనేజ్ మెంట్ స్టడీస్ ( సి.ఎమ్.ఎస్) నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్ ప్రారంభ సెషన్ ముగిసిన తరువాత ఆమె మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఫెడరల్ ఫ్రంట్...రాజకీయ అంశం కాదు..ప్రజల ఆవసరాలు తీర్చుతూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకోసమేనని ఎంపి కవిత స్పష్టం చేశారు.

తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశ మంతా అమలు చేయాలన్నదే సీఎం లక్ష్యం అన్నారు. అంతే తప్ప పదవులకోసమో మరింకో దానికో కేసీఆర్ ప్రాకులాడరన్నారు. 70 ఏళ్లలో దేశంలో జరగని అభివృద్ధి ని తెలంగాణ లో 3 ఏళ్ళలో సాధించామని తెలియజెప్పడంతో పాటు.. దేశమంతటా ఈ అభివృద్ది ఫలాలు అందించాలన్నదే సీఎం కెసీఆర్ లక్ష్యం అన్నారు. కేంద్రప్రభుత్వం పై టిడిపి, వైసిపిల అవిశ్వాశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని మరో ప్రశ్నకు ఎంపి కవిత సమాధానం ఇచ్చారు. కవిత మాట్లాడిన వీడియో ఉంది చూడొచ్చు.