న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భేటీ ముగిసింది. ఆయన శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. గత 20 రోజుల్లో కేసీఆర్ మోడీని కలవడం ఇది రెండోసారి.

మోడీతో కేసిఆర్ 14 అంశాలపై కేసిఆర్ ప్రధానికి నివేదిక సమర్పించారు విభజన హామీలు, రిజర్వేషన్ల కల్పన, హైకోర్టు విభజన, జోనల్ వ్యవస్థలపై ఆయన ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలపై కూడా కేసిఆర్ మోడీతో మాట్లాడినట్లు చెబుతున్నారు. 

కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర వేయించుకోవడానికే కేసిఆర్ ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చినట్లు చెబుతున్నారు.