కుమారస్వామితో భేటీ: పంచ్ డైలాగ్ విసిరిన కేసీఆర్

KCR meets Kumara swamy and congratulates
Highlights

 కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుభాకాంక్షలు తెలిపారు. 

బెంగళూరు: కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుభాకాంక్షలు తెలిపారు. ఒక రోజు ముందే మంగళవారం ఆయన బెంగళూరు వెళ్లి కుమారస్వామికి తన అభినందనలు తెలిపారు. 

ఈ సందర్బంగా కేసిఆర్ పంచ్ డైలాగ్ విసిరారు. ఇది ఆరంభం మాత్రమేనని, ప్రాంతీయ పార్టీల పవరేమిటో భవిష్యత్తులో చూస్తారని కేసిఆర్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన బెంగళూరులోని దేవెగౌడ నివాసానికి ఆయన వెళ్లారు. దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణతో కేసీఆర్ మాట్లాడారు. 

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కుమారస్వామి సీఎం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కుమారస్వామికి దేవుడి దీవెనలు ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో తనకు రేపు (బుధవారం) కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఉందని, దాంతో కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని ఆయన తెలిపారు. రేపు రాలేకపోతున్నందువల్ల ఇవాళ కుమారస్వామిని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు కేసీఆర్ వెల్లడించారు.

కేసిఆర్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వచ్చారు. సీఎం వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేకే సంతోష్ కుమార్, వినోద్, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.

దేవేగౌడ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు దేవేగౌడ స్వయంగా పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు.  ఆ తర్వాత కేసిఆర్ దేవేగౌడకు, కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు. 

loader