తెలంగాణ సిఎం కేసిఆర్ ను తమిళనాడు పర్యటనలో భాగంగా కరుణానిధి కుమార్తె, డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ప్రత్యేకంగా భేటీ అయ్యరు. కేసిఆర్ అండ్ టీం ను కనిమొళి కలిశారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చ జరిగింది. తెలంగాణ నుంచి కేసిఆర్ తోపాటు వెళ్లిన నాయకులందరినీ కేసిఆర్ కనిమొళికి పరిచయం చేశారు. అందరితో నవ్వుతూ మాట్లాడారు కనిమొళి.

సిఎం కేసిఆర్ బృందం చెన్నై వెళ్లిన వెంటనే ముందుగా కరుణానిధితో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి స్టాలిన్ ఇంటికి వెళ్లారు. రెండోరోజు హోటల్ లో కనిమొళి సిఎం కేసిఆర్ ను కలిసినట్లు చెబుతున్నారు. వీరి భేటీ తాలూకు వీడియో పైన ఉంది చూడండి.