Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే జాతీయ పార్టీ: హైద్రాబాద్ వేదికగానే పార్టీ పేరును ప్రకటించనున్న కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.  జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కమిటీలు ఇవాళ  తీర్మానం చేయనున్నాయి. 

KCR  likely to launch of national party Soon in Hyderabad
Author
First Published Sep 9, 2022, 9:34 AM IST

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇవాళ రాష్ట్రంలోని టీఆర్ఎస్ జిల్లా కమిటీలు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేయనున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ క్రమంలోనే  జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు.

గత కొంత కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిందని కేసీఆర్ ఆరోపణలు చేశారు. సమయం వచ్చినప్పుడల్లా బీజేపీపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ విమర్శలను బీజేపీ నాయకత్వం తిప్పి కొడుతుంది. 

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతుంది. ఇవాళ టీఆర్ఎస్ జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ సమావేశాల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మానం చేయనున్నారు. 
ఇటీవలనే నిజామాబాద్ లో జరిగిన సభలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. 

గత వారంలో బీహర్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు.  బీహర్ సీఎం నితీష్ కుమార్ తో జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. బీజేపీయేతర పార్టీలతో పొత్తుల విషయమై కేసీఆర్ చర్చించారు. కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో  నితీష్ కుమార్ సమావేశమయ్యారు.  2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ముక్త్  భారత్ లక్ష్యంగా కార్యాచరణను కేసీఆర్ సిద్దం చేసుకుంటున్నారు. ఈ విషయమై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు.

హైద్రాబాద్ వేదికగానే కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటును ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఇదిలా ఉంటే ఈ నెల 11వ తేదీ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైద్రాబాద్ కు రానున్నారు. కేసీఆర్ తో చర్చించనున్నారు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. 

తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయాలని బీజేపీ  ప్రయత్నాలు చేస్తుందని కొందరు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు కేసీఆర్ కు చెప్పారు. పార్టీ ఏర్పాటుకు ఇది సరైన సమయమని కూడా రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు కేసీఆర్ కు తెలిపినట్టుగా  టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

గవర్నర్ల వ్యవస్థతో పాటు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్ధులపై బీజేపీ ఉపయోగించుకుంటుందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా వారు గుర్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios