జనగామ: వ్యవసాయ రంగంలో ఇది ఓ చరిత్ర అని, ప్రపంచంలో ఎక్కడ కూడా వేదికలకు లేవని, అందువల్ల రైతు వేదిల ఏర్పాటు చరిత్ర అని కేసీఆర్ అన్నారు. ఒక చోట కూర్చుని రైతులు మాట్లాడుకునే వ్యవస్థ లేదని లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రైతులు పిడికిలి ఎత్తి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు మించి చెల్లించి ధాన్యం కొనుగోలు చేయవద్దని ఎఫ్సీఐ ఆదేశాలు జారీ చేసిందని, దీనిపై రైతులు పోరాడాలని ఆయన అన్నారు. అధిక దరలు చెల్లిస్తే ధాన్యమే కొనుగోలు చేయబోమని రాష్ట్రాలకు ఏఫ్సీఐ ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు.

మేం లేకుంటే మీరెక్కడ అని సంకేతాలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాలని ఆయన అన్నారు. అందుకు తెలంగాణ రైతులు సిద్ధం కావాలని ఆయన అన్నారు. భారతదేశంలో మన ప్రభుత్వం మాత్రమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు. సెకండ్ వేవ్ కరోనా వస్తుందని అంటున్నారని, అయినా ఏ ఊరుకు ఆ ఊరిలో ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేస్తారని ఆయన చెప్పారు. రైతు వేదికలు ఆటంబాబు అని ఆయన అన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి పెద్ద కాపు అని, తాను కూడా కాపోడినే అని ఆయన అన్నారు. 

తాను బతికి ఉన్నంత వరకు రైతు బంధు ఆగదని ఆయన స్పష్టం చేశారు. కౌలు రైతులను ఈ విషయంలో తాము పట్టించుకోబోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జమీందార్లు, జాగీర్దార్లు లేరని ఆయన చెప్పారు. రైతులకు మాత్రమే తాము రైతు బంధు పథకం వర్తింపజేస్తామని చెప్పారు.

తమ ప్రభుత్వం 38 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, కేంద్రం 6.95 లక్షల మందికి మాత్రమే ఇస్తుందని, మొత్తం తామే ఇస్తున్నట్లు కేంద్రాన్ని పాలించే బిజెపి చెబుకుంటోందని ఆయన అన్నారు. తాము 11 వేల కోట్ల పైచిలుకు ఇస్తున్నామని, కేంద్రం ఇచ్చేది కేవలం వంద కోట్లు మాత్రమేనని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.కార్పోరేట్ గద్లల కోసమే కేంద్రం వ్యవసాయ చట్టాలను తెచ్చిందని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించారు. తెలంగాణలో రూ.350 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఇందులో 2462 గ్రామీణ ప్రాంతాల్లో, 139 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1951 రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. మరో 650 వేదికలు నిర్మాణ దశలో ఉన్నాయి. 

కొండకండ్లలో జరిగిన కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి, మత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడు తదితరులు పాల్గొన్నారు. రైతు సాగు సమస్యలపై చర్చించడానికి, అధిక దిగుబడులూ సస్య రక్షణ కోసం అనుసరించాలన్సిన అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకునేందుకు రైతు వైదికలను ఏర్పాటు చేస్తున్నారు.