హైదరాబాద్:  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు సీఎంలు ప్రగతి భవన్ లో భేటీ  అవుతారు. 

Also read:జనవరి 13న రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం

రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఇద్దరరు సీఎంలు  ఇప్పటికే మూడు దఫాలు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు.ఈ చర్చలకు కొనసాగింపుగానే ఇవాళ మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. గత ఏడాది నవంబర్ 23వ తేదీన ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు.

ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ రెండు నదులను అనుసంధానం చేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు నీటిని వినియోగించుకోవాలని భావించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకొంటారు.