హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  ఈ నెల 13 తేదీన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించనున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఇద్దరు సీఎంలు ఇప్పటికే మూడు దఫాలు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు.

ఈ చర్చలకు కొనసాగింపుగానే మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలు మరోసారి సమావేశం కానున్నారు. గత ఏడాది నవంబర్ 23వ తేదీన ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు.

ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ రెండు నదులను అనుసంధానం చేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు నీటిని వినియోగించుకోవాలని భావించారు.

ఇటీవలనే విద్యుత్ ఉద్యోగుల విభజన విషయమై జరిగింది . రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. సచివాలయ భవనాలు తెలంగాణ కు అప్పగించింది ఏపీ సర్కార్.