బీఆర్ఎస్ సీఎం అభ్యర్ధి కేసీఆరే.. హుజూరాబాద్‌లోనూ గెలుస్తాం , త్వరలోనే 4 స్థానాలకు అభ్యర్ధులు : కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీఎం అభ్యర్ధి కేసీఆరే అని అన్నారు మంత్రి కేటీఆర్ . పెండింగ్‌లో వున్న 4 స్థానాలకు త్వరలోనే అభ్యర్ధులను ప్రకటిస్తామని , నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన దుయ్యబట్టారు.  

kcr it the cm candidate in brs for telangana assembly elections says minister ktr ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తూ వుండగా.. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధుల ఎంపికలోనే వున్నాయి. మరోవైపు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరుగుతోంది. విపక్షాలకు తన దైన శైలిలో కౌంటరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీఎం అభ్యర్ధి కేసీఆరే అని అన్నారు . శుక్రవారం ఆయన మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలలో సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. పెండింగ్‌లో వున్న 4 స్థానాలకు త్వరలోనే అభ్యర్ధులను ప్రకటిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్ధులు లేరని.. కానీ తాము 70 స్థానాల్లో గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని దుయ్యబట్టారు. తమకున్న సమాచారం ప్రకారం కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి రూ.8 కోట్లు అందాయని కేటీఆర్ ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన దుయ్యబట్టారు. 

ALso REad: కర్ణాటక నుంచి వందల కోట్లు.. తెలంగాణలో ‘స్కామ్‌గ్రెస్’కు చోటు లేదు : కేటీఆర్

తెలంగాణలో మైనార్టీలు బీఆర్ఎస్ వైపే వున్నారని.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 286 మైనార్టీ హాస్టల్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో బుల్డోజర్ కూల్చివేతలు, మిషనరీలపై దాడులు లేవని మంత్రి స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలపైనే ఐడీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని.. కాంగ్రెస్ నేతల మీద ఎందుకు జరగడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా కారణంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామని, హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ డిజిట్ దాటదని..  ఆ పార్టీకి 110 స్థానాల్లో డిపాజిట్ రాదని కేటీఆర్ జోస్యం చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios