Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కి అహంకారం ఎక్కువ.. రాజ్యాంగాన్ని అభాసుపాలు చేస్తున్నారు.. కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే (వీడియో)

కేసీఆర్ కి అహంకారం ఎక్కువ అని.. రాజ్యాంగాన్ని అభాసుపాలు చేస్తున్నాడంటూ కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే విరుచుకుపడ్డారు. 
 

KCR is undermining the Constitution says Union Minister Mahendra Nath Pandey
Author
Hyderabad, First Published Jul 2, 2022, 2:15 PM IST

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్నాదన్నారు.  రాష్ట్ర సాధనలో బీజేపీ పార్టీ పాత్ర కూడా ఉందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్ళు, నిధులు, నియామకాల కోసం అని.. కానీ రాష్ట్ర వచ్చాక అనుకున్నది ఏదీ ఇక్కడ జరగటం లేదన్నారు.

తెలంగాణలో కట్టిన ప్రాజెక్ట్ లు అన్ని కల్వకుంట్ల కుటుంబానికి ఏటిఎంలుగా మారాయని ఎద్దేవా చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8 సంవత్సరాలలో రైతుల కోసం సమ్మాన్ నిధి, బాలికల కోసం సుకన్య సమృద్ధి కింద 3 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ లో అందరూ ఇండియాలో ఏమి జరుగుతుంది అని భయపడ్డారు. కానీ మనమే వాక్సిన్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేశాం అని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం ఫెయిల్ అయిందని.. రైతు బంధు ఫెయిల్ కి కారణం.. బంజరు భూములకు కూడా నిధులు ఇస్తున్నారన్నారు. ఇక్కడ అమలు చేసే ప్రతీ పథకాల్లోనూ టిఆర్ఎస్ లీడర్లు అవనీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

‘డియర్ సుప్రీం లీడర్.. హైదరాబాద్ కు స్వాగతం’.. మోడీపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు...

18 రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఉన్నది.. అందరూ ప్రతినిధులు నేరుగా సచివాలయంకు వెళ్తారు. వారి వారి ముఖ్యమంత్రులను కలుస్తారు. కానీ తెలంగాణలో కేసిఆర్ గారికి అహంకారం ఎక్కువ. ఎవరికి కూడా నేరుగా కలిసే అవకాశం లేదు. అందుకే ఇక్కడ తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యములో బీజేపీనీ అధికారంలోకి తేవాలి.

మోడీ గొప్ప పాపులారిటీ ఉన్న వ్యక్తి. అందుకే బీజేపీ అధికారంలోకి రావాలి. దీనికోసం అన్ని రంగాల వారి మద్దతు తీసుకోవాలి. అందరి సహకారంలో బీజేపీని అధికారంలోకి తేవాలి. భారత ప్రధాని మోడీ మూడుసార్లు తెలంగాణకు వచ్చారు. ఇది మూడో పర్యటన. అయితే ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని రిసీవ్ చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి కలవకుండా రాజ్యాంగాన్ని అభాసుపాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇలా చేసిన తెలంగాణ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని విరుచుకుపడ్డారు. 

ఇదిలా ఉండగా, మోదీ మీద సెటైర్లు వేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ.. హైదరాబాద్ కు వస్తున్న అత్యుత్తమ నాయుడికి స్వాగతం అన్నారు. ఇక్కడికి రావడమే కాదే.. ఈ పర్యటనలో పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైతం ఇందులో ప్రస్తావించారు.  మోడీ పర్యటనకు వస్తున్నాడంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్నారని ఇవన్నీ ప్రజలు కట్టిన పన్నుల నుంచి తీస్తారని  అన్నారు. అయితే,  తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారని,  అందుకే ఈ అభివృద్ధి ఫలాలను మీరు కూడా మీ పర్యటనలో ఆస్వాదించాలని,  దూరదృష్టితో  మౌలిక సదుపాయాలను ఎలా అందించాలో తెలంగాణ చూసి నేర్చుకోవాలని  పరోక్షంగా  నరేంద్ర మోడీని ఉద్దేశించి  ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios