Asianet News TeluguAsianet News Telugu

‘డియర్ సుప్రీం లీడర్.. హైదరాబాద్ కు స్వాగతం’.. మోడీపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు...

నటుడే ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోడీమీద సెటైరికల్ ట్వీట్ చేశారు. నేడు హైదరాబాద్ పర్యటన సందర్భంగా చూసి నేర్చుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

Prakash Raj satirical tweet on Modi, Dear Supreme Leader, Welcome to Hyderabad
Author
Hyderabad, First Published Jul 2, 2022, 1:09 PM IST

హైదరాబాద్ : విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ సుపరిచితం. ఇటీవలి కాలంలో కేసీఆర్ తో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమికి తోడ్పాటునందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్ కు రానున్న మోడీమీద పరోక్షంగా విరుచుకుపడ్డారు. రాజకీయనేతగా మారిన ఈ నటుడు ప్రధాని నరేంద్ర మోదీ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. తెలంగాణలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ జాతీయ నేతలు, ఇతర నేతలంతా హైదరాబాద్ కు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మోదీ మీద సెటైర్లు వేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన... తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ.. హైదరాబాద్ కు వస్తున్న అత్యుత్తమ నాయుడికి స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైతం ఇందులో ప్రస్తావించారు.  మోడీ పర్యటనకు వస్తున్నాడంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్నారని ఇవన్నీ ప్రజలు కట్టిన పన్నుల నుంచి తీస్తారని  అన్నారు.  

హెచ్‌ఐసీసీలో బీజేపీ పదాధికారులు సమావేశం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో భేటీ..

అయితే,  తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారని,  అందుకే ఈ అభివృద్ధి ఫలాలను మీరు కూడా మీ పర్యటనలో ఆస్వాదించాలని,  దూరదృష్టితో  మౌలిక సదుపాయాలను ఎలా అందించాలో తెలంగాణ చూసి నేర్చుకోవాలని  పరోక్షంగా  నరేంద్ర మోడీని ఉద్దేశించి  ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనితోపాటు సీఎం కెసిఆర్ ఫోటో, కాళేశ్వరం ప్రాజెక్టు,  యాదాద్రి,  టీ హబ్,  ప్రభుత్వ ఆసుపత్రి,  గురుకుల పాఠశాల భవనాల తో కూడిన ఫోటోలను కూడా షేర్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios