Asianet News TeluguAsianet News Telugu

Mlc Elections:ప్రగతి భవన్ నుండి ఏడుగురికి పిలుపు, మాజీ స్పీకర్ కు రాని ఆహ్వానం

ఎమ్మెల్సీ ఆశావాహులకు ప్రగతి భవన్ నుండి పిలుపు వచ్చింది. ఎమ్మెల్యే కోటాతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలకు కేసీఆర్ నుండి పిలుపు వచ్చింది.

Kcr invites seven MLC aspirants  to Pragati bhavan
Author
Hyderabad, First Published Nov 15, 2021, 4:30 PM IST

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావాహులకు ప్రగతి భవన్ నుండి పిలుపు వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రగతి భవన్ నుండి ఫోన్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకొంది. మాజీ స్పీకర్ మధుసూధనాచారికి ప్రగతి భవన్ నుండి పిలుపు రాలేదని తెలుస్తోంది.తెలంగాణ శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఆకుల లలితలకు ప్రగతి భవన్ నుండి పిలుపు వచ్చింది. ఐఎఎస్ కు రాజీనామా చేసిన  సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా ప్రగతి భవన్ కు చేరుకొన్నారు. వెంకట్రామిరెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది.

also read:సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ లోకి.. !!

ఎమ్మెల్సీ పదవుల కోసం trs లో పోటీ నెలకొంది. దీంతో ఆశావాహులు kcr ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్ధుల ఎంపికకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో ఏడుగురికి ప్రగతి భవన్ నుండి పిలుపు రావడంతో ఎమ్మెల్సీ గా వారిని ఖరారు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికను చేయనున్నారు కేసీఆర్. 2023 లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో టీఆర్ఎస్ నాయకత్వం  కూడా బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. 

రేపు టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం

ఈ నెల 16న టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం హైద్రాబాద్ లో జరగనుంది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎmlc elections పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు. వరి కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. యాసంగిలో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది. వరి పంట విషయంలో  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్దం సాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నారా లేదా అని ఆయన రైతులను అడిగి తెలుసుకొంటున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో బండి సంజయ్  ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.,టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్జాలబావి, కుక్కడం తదితర కొనుగోలు కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios