Asianet News TeluguAsianet News Telugu

నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన.. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్ పనుల పురోగతి పరిశీలన..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకన్న సీఎం కేసీఆర్.. పనుల పురోగతిని పరిశీలించారు.

KCR inspects Yadadri Thermal Power Plant works at Damaracherla in Nalgonda district
Author
First Published Nov 28, 2022, 2:18 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ప్లాంట్ వద్దకు చేరుకన్న సీఎం కేసీఆర్.. పనుల పురోగతిని పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా థర్మల్‌ పవర్‌ ప్లాంట్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం ప్లాంట్‌ నిర్మాణపనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పవర్‌ప్లాంటు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్లాంట్ నిర్మాణ పనులపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశం ఉంది. తర్వాత సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

2015 జూన్‌లో రూ. 29,992 కోట్లతో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ 2021 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని భావించాలని.. కోవిడ్, ఇతర పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదు. ఇక, ఇప్పటికే ప్లాంట్‌లో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోగా మొదటి యూనిట్‌ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios