వాస్తు ముఖ్యమంత్రి సారీ...సారీ...  తెంలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రజల డబుల్ బెడ్ రూం ఇళ్ల కంటే చాలా వేగంగా నిర్మించుకున్న ప్రగతి భవన్ లో అప్పుడే సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు జరుపుతున్నారు.

 

ఇందులో భాగంగా  మంగళవారం ఉబర్‌ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన  బైక్‌ ఆన్ రెంట్ కార్యక్రమాన్ని సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో ఆయన మనవడు హిమాంశ్ కూడా క్యాంప్‌ ఆఫీస్‌కి వచ్చారు.

 

అక్కడే ఉన్న బ్యాటరీ వాహనాన్ని స్వయంగా నడపుకుంటూ  తన తాత గారు నిర్మించిన ప్రభుత్వం కార్యాలయ సముదాయాన్ని పరిశీలించారు.

 

హిమాంశు గతంలో సచివాలయంలోని సీఎం ఆఫీసుకు వెళ్లి ఆయన కుర్చీలో కూర్చున్నట్లు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి.

 

 

ఎంతైనా సీఎం మనవడు అంటే కచ్చితంగా సర్కారుకు కూడా మనవడే మరి...