Asianet News TeluguAsianet News Telugu

వారిని ప్రతిరోజు మిస్ అవుతున్నాను.. ముఖ్యంగా తాతయ్యను: కేసీఆర్ మనవడు హిమాన్షు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనువడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్లిన హిమాన్షు.. ఎక్స్(ట్విట్టర్)‌ లో ఒక ఎమోషనల్ పోస్టు చేశారు.

kcr grandson Himanshu posts on X he miss family and Especially his granfather ksm
Author
First Published Oct 5, 2023, 5:12 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనువడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్లిన హిమాన్షు.. ఎక్స్(ట్విట్టర్)‌ లో ఒక ఎమోషనల్ పోస్టు చేశారు. తన ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టుగా పేర్కొన్నారు. తన ఫ్యామిలీతో ఉన్న చిత్రాలను షేర్ చేసిన హిమాన్షు.. ‘‘నేను వారిని ప్రతిరోజూ మిస్ అవుతున్నాను. ముఖ్యంగా తాతయ్యను మిస్ అవుతున్నాను’’ అని తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

 

ఇక, కేసీఆర్‌కు తన మనవడు హిమన్షు మీద అమితమైన ప్రేమ కనబరుస్తారనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు తన పర్యటనల్లో హిమాన్షును కూడా తీసుకుని వెళ్లేవారు. హిమాన్షుకు కూడా తాత అంటే చాలా ప్రేమ ఉంది. తన తాత అంటే ఎంత ఇష్టమనేది హిమాన్షు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక, ఇటీవల కూడా కేసీఆర్‌పై తన అభిమానాన్ని చాటుతూ హిమాన్షు ఓ పోస్టు చేశారు. 

పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఏఐ ఇల్యూషన్ ఫొటోను షేర్ చేసిన  హిమాన్షు.. కొందరు తాము ఆరాధించే వ్యక్తులను ద్వీపాలలో చూస్తే.. మరికొందరు ఎడారుల్లో చూస్తారని.. కానీ తాను తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలోనూ చూస్తానని పేర్కొన్నారు.  ‘కేసీఆర్ వన్స్ అగైన్’ అని ట్యాగ్‌ కూడా జత చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios