గ్రామాల అభివృద్ధికి టిఆర్ఎస్ చేసింది సున్నా : బిజెపి రావు పద్మ

KCR Govt failed in rural development: Rao padmaja
Highlights

సర్పంచ్ ఎన్నికలు ఒకేదఫాలో జరపాలి

తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యంమని, ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఎల్కాతుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు అడెపు శ్రీవర్ధన్ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా రావు పద్మ మాట్లాడారు.

గ్రామాలలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అన్నారు. ఒక్క ఎల్కాతుర్తి మండలంలోని గ్రామాల అభివృద్ధికి జూన్ 2014 నుండి మార్చ్ 2018 వరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 4,36,43,091; స్వచ్ఛ భారత్ పధకం ద్వారా 1,36,93,800; హరితహారం కొరకు 1,33,82,094; 14వ ఆర్ధిక సంఘం నిధుల ద్వారా :  1,46,32,002, మొత్తం: 8,53,49,187 రూపాయిలు నరేంద్రమోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. ఇక్కడి కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. ఎటువంటి హామీలు ఇవ్వకపోయిన కేంద్ర ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో దేశంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని భారీ నిధులను అందజేస్తుందన్నారు. కానీ ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ హామీల బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజలకు చేసింది మాత్రం ఏమిలేదని ఘాటుగా విమర్శించారు.

 

గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకే దఫాలో నిర్వహించాలని వరంగల్ అర్బన్ జిల్లాలో రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ఒకే దఫాలో నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. మూడు దఫాలుగా నిర్వహించాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలన్నారు. బ్యాలెట్ పేపర్ ను తెలుపు రంగులో పెట్టాలని డిమాండ్ చేశారు.

loader