హైదరాబాద్: పార్టీలో చేరినప్పటి నుండి మా నాన్న నోముల నరసింహయ్య కు కెసిఆర్ సముచిత స్థానం కల్పించారని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నోముల భగత్ చెప్పారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వ పథకాలే మా నాన్న ను గెలిపించాయన్నారు.  ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల లోపే మా నాన్న ను కోల్పోయి ఉప ఎన్నిక రావడం దురదృష్టకరమన్నారు.

also read:సర్వేలన్నీ మనకే అనుకూలం: నాగార్జునసాగర్ పై కేసీఆర్

నా మీద నమ్మకముంచి టికెట్ కేటాయించిన సీఎం కెసిఆర్ కు ,పార్టీ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన చెప్పారు. మా నాన్న ఆశయాలు నెరవేరుస్తానని ఆయన చెప్పారు. నాన్న  చనిపోయాక వచ్చిన ఎన్నికలు ఇవి ప్రజలు నన్ను ఆదరిస్తారని భావిస్తున్నానన్నారు. 

నర్సింహయ్య వారసునిగా నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.లక్షన్నర కు పైగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు నాగార్జున సాగర్ లో వున్నారని ఆయన చెప్పారు. 2018 నుంచి ఇప్పటివరకు మా నియోజకవర్గంలో బిజెపి ఏమి పెరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.