Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో జగన్, చంద్రబాబులపైనే కేసీఆర్ భవిష్యత్తు

వచ్చే ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పరీక్ష పెట్టనున్నాయి. 

KCR fate in next elections will be decided by Jagan and Chnadrababu

హైదరాబాద్: వచ్చే ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పరీక్ష పెట్టనున్నాయి. ఆయన భవిష్యత్తును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ నిర్ణయించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వారిద్దరి పార్టీలకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది.

గత ఎన్నికల్లో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య ఓట్ల తేడా కేవలం 8 శాతం మాత్రమే.  టీఆర్ఎస్ కు 34 శాతం ఓట్లు రాగా, కాంగ్రెసు 26 శాతం ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి 8 శాతం ఓట్లు, బిజెపి- టీడీపి కూటమికి 21 శాతం ఓట్లు వచ్చాయి. 

అయితే, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది. పైగా, బిజెపితో పొత్తు పెట్టుకుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. ఈసారి ముఖాముఖి పోటీకి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెసు తెలంగాణలో కనుమరుగైంది. తెలుగుదేశం పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తోంది. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీల ఓట్లు కూడా టీఆర్ఎస్, కాంగ్రెసులకు వ్యతిరేకమైనవే.

టీడిపి ఓ లోకసభ సీటును, 15 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. వైసిపి ఓ లోకసభ స్థానాన్ని 3 శాసనసభా స్థానాలను గెలిచింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసిపి ఎంపితో పాటు ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి ఫిరాయించారు. టీడీపికి చెందిన ఏకైక ఎంపితో పాటు 12 మంది శాసనసభ్యులు కూడా గులాబీ జెండా పట్టుకున్నారు. 

ప్రస్తుతం నాయకులతో టీడిపి క్యాడర్ కూడా అధికార టీఆర్ఎస్ లోకి మారింది. వైసిపి క్యాడర్ కూడా అంతే. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. వైసిపి, టీడీపిలకు చెందిన క్యాడర్ వారి నాయకులతో పాటు టిఆర్ఎస్ కు పూర్తి మారి ఉంటే పరిస్థితి కాస్తా భిన్నంగా ఉంటుంది. గత ఎన్నికల్లో వైసిపి, టీడీపిలకు ఓటు చేసిన ప్రజలపైనే కేసిఆర్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios