తెలంగాణ జర్నలిస్టుకు కేసిఆర్ సర్కారు పెద్ద సాయం

KCR extends finacial assistance for Journalist's operation
Highlights

ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రికి 23 లక్షలు మంజూరు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నల్లమల ప్రాంత INB ఛానల్ జర్నలిస్టు అనంతరాములు గత కోన్ని రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద కార్పోరేట్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు.

కాలేయం మార్పిడి శస్త్రచికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి జర్నలిస్టు ఆరోగ్య పథకం ద్వారా రూ.23 లక్షలను మంజూరు చేస్తూ శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఇప్పటి వరకు జర్నలిస్టులకు రాష్ట్రంలో ఇత పెద్ద మొత్తంలో డబ్బులు ఏ జర్నలిస్టుకూ మంజూరు కాలేదు. మొదటి సారి జర్నలిస్టు అనంతరాములుకు మంజూరు అయ్యాయి. అనంతరాములుకు ఆపరేషన్ విషయమై నిధులు విడుదల కోసం ప్రత్యేకదృష్టి పెట్టిన తెలంగాణ మీడియా ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం, సచివాలయం జర్నలిస్టు మిత్రులకు అచ్చంపేట ప్రెస్ క్లబ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

గత వారం రోజులుగా సీరియస్ గా ఫాలోప్ చేసి.....సచివాలయంలో దగ్గరుండి ఉత్తర్వులు విడుదల చేయించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి, కోశాధికారి మారుతిసాగర్, ఇస్మాయిల్, అబ్దుల్లా, పల్లె రవికుమార్ ఇతర రాష్ట్ర నాయకులకు అందరికి అనంతరాములు కుటుంబసభ్యుల నుంచి, నల్లమల ప్రాంత జర్నలిస్టుల నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతరాములుకు మూడు రోజుల తర్వాత ఆపరేషన్ చేసే అవకాశం ఉందని తెలిపారు.

loader