తెలంగాణ భవన్ లో కెసిఆర్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. 

తెలంగాణాలో నేషనల్ హెల్త్ ప్రొఫైల్ తీసుకురాబోటీహున్నట్టు తెలిపాడు. గతంలో కంటివెలుగు ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అయిందని, ప్రపంచంలోనే అది అతిపెద్ద స్క్రీనింగ్ ప్రోగ్రాం అని కెసిఆర్ ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ చెప్పిన విషయాన్నీ గుర్తు చేసాడు. దీన్ని వెంటనే ఏర్పాటు చేయలేకపోయినా... త్వరలోనే ప్రారంభిస్తానని చెప్పారు. 

తెలంగాణ కు ఒక ప్రత్యేకమైన గల్ఫ్ పోలీసైని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు కెసిఆర్. తానే స్వయంగా గల్ఫ్ కి వెళ్లి అక్కడి వారి బాధలను స్వయంగా తెలుసుకొని ఒక సమగ్ర ప్రణాలికను రూపొందించనున్నట్టు తెలిపారు. 

నిరక్షరాస్యత కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు తెలంగాణకు ఇచ్చిన గిఫ్ట్ అని, దాన్ని రూపుమాపేందుకు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈచ్ వన్ టీచ్ వన్ అని అందుకే పెట్టిందన్నారు. తానే స్వయంగా ఈ సమస్యను భుజానికి ఎత్తుకొని ముందుకు సాగనున్నట్టు తెలిపారు. విద్యాభ్యాసంలోనే నైతిక విలువలు కూడా నేర్పాలని ఆకాంక్షించారు. అందుకు ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు. 

నూతన రెవిన్యూ చట్టం తీసుకురానున్నట్టు తెలిపారు. పెట్రో సీసాలు పట్టుకొని రెవిన్యూ ఆఫీసులకు ప్రజలు వస్తున్నారంటే.... వారిపైన ఎంత అసహ్యం ఉందొ అర్థం చేసుకోవాలని, ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. 

రోజువారీ లెక్కలను జమ కట్టాలని చెబుతూ... రెవిన్యూ ఉద్యోగులతో తమకు ఎటువంటి శత్రుత్వం లేదని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి కోసం వాడాల్సిందేనని, వాడకపోతే తమను ప్రజలు ఎప్పటికి క్షమించజాలరని అన్నారు. 

నూతన గ్రామ పంచాయతీ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు కెసిఆర్. పోటీచేసే వారు చట్టాన్ని చదుకొని పోటీ చేయాలనీ, ఏ పార్టీవారినయినా ఉపేక్షించేదిలేదని అన్నారు కెసిఆర్. 

నేరుగా గ్రామాలకు, పట్టణాలకు నిధులను విడుదల చేయనున్నట్టు చెప్పారు. కొద్దిగా పన్నులను పెంచనున్నట్టు తెలిపారు. కట్టగలిగేవారు మీదనయినా పెంచుతామని అన్నారు కెసిఆర్. మునిసిపల్ గ్రామపంచాయతీ పన్నులు కొత్త ఆర్ధిక సంవత్సరంలో పెంచడం తథ్యం అని కుండబద్ధలుకొట్టారు కెసిఆర్. 

రైతు సమన్వయ సమితిలన్నిటిని క్రియాశీలకం చేయబోతున్నట్టు చెప్పారు కెసిఆర్. క్లస్టర్ మోడళ్లుగా రైతు వేదికగా చేసి వారందరిని క్రమబద్దెకరిస్తామని అన్నారు. రైతు రాజ్యం అంటే ఏమిటో చూపిస్తామని అన్నారు. తెలనగానా ఉద్యమం ఏ లెవెల్ లో అయితే చేసానో అదే విధంగా దీన్ని కూడా చేయబోతున్నట్టు తెలిపాడు. 

ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులందరినీ రెగ్యూలరైజ్ చేయనున్నట్టు తెలిపారు. వారు వాల్యూ ఎడిషన్ చేసిన ప్రొడక్ట్స్ ద్వారా ఇటు రైతులకు అటు మహిళా కార్మికులకు పనికల్పిస్తారని ఆశిస్తారు. ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు కెసిఆర్. 

లిజ్జత్ పాపడ్ ఉదాహరణ చెబుతూ ఫ్యూడన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎలా పెద్దగా ఎదుగుతాయో చెప్పారు. ఐకేపీ సంఘాలు కూడా ఇలానే పనిచేయాలని అన్నారు. 

మిగిలి ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయనున్నట్టు తెలిపారు. దుమ్ముగూడెం నుండి మొదలుకొని తుపాకులగూడెం వరకు అన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు తెలిపారు కెసిఆర్. 

నిరుద్యోగ భృతిపై కూడా తేల్చనున్నట్టు తెలిపారు. ఆర్థికమాంద్యం వల్ల చేయలేకపోతున్నట్టు తెలిపారు. నిరుద్యోగి అనే వాడు ఎవరో తేల్చాల్సి ఉందని, అందుకోసం అవసరమైన స్టడీ చేయనున్నట్టు తెలిపారు.