Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుండి నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్  పలువురు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

KCR decides to have Assembly session from September 7
Author
Hyderabad, First Published Aug 17, 2020, 8:29 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుండి నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్  పలువురు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు అభిప్రాయపడ్డారు. 

కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలన్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులను కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది.

అసెంబ్లీ సమావేశాలకు సిద్దం కావాలని ఆయన కోరారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులను సిఎం ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios