తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్దం అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేష్, మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌లపై పరువు నష్టం దావా వేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్దం అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేష్, మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌లపై పరువు నష్టం దావా వేయనున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును కూడా ఆశ్రయించనున్నారు. ఇందుకు సంబంధించి కవిత ఇప్పటికే న్యాయ నిపుణుతలో చర్చలు జరుపుతున్నారు.
ఇక,ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌పై తనపై వస్తన్న ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీజేపీ నేతలు తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సోమవారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాలపై బట్టకాల్చి మీదేస్తున్నారని మండిపడ్డారు. నిరాధారంగా ఏది పడితే అది మాట్లాడటం ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకర పరిణామం కాదని అన్నారు. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ప్రస్తుత అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
కేసీఆర్ కూతురు కాబట్టే తనపైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే.. కేసీఆర్ భయపడతాడని ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోందని కవిత అన్నారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలని చూస్తున్నారని అన్నారు. తన కుటుంబం గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని.. అయితే అది కుదరదని పని అన్నారు.
వారి చేతిలోనే అన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయని.. వారికి ఎటువంటి విచారణ కావాలన్న చేసుకోవచ్చని కవిత చెప్పారు. తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని.. ఎవరికీ భయపడేది లేదని చెప్పారు.
