వర్షం ఎఫెక్ట్: ప్రగతి నివేదన సభా ప్రాంగంణంలో కుప్పకూలిన కేసీఆర్ కటౌట్ (వీడియో)

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 1, Sep 2018, 9:00 PM IST
kcr cut out collapsed due to heavy rains at pragati nivedana sabha in kongara kalan
Highlights

శనివారం రాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో ప్రగతి నివేదన సభ వద్ద ఏర్పాటు చేసిన కేసీఆార్ భారీ కటౌట్ కుప్పకూలింది. 


హైదరాబాద్: శనివారం రాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో ప్రగతి నివేదన సభ వద్ద ఏర్పాటు చేసిన కేసీఆార్ భారీ కటౌట్ కుప్పకూలింది. సెప్టెంబర్ రెండో తేదీన నాలుగేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేసింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్గంగా సుమారు 25 లక్షల మందిని ఈ సభకు సమీకరించేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.ఈ మేరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వారం రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

"

ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద ప్రగతి నివేదన సభను నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఆయా జిల్లాల నుండి ప్రజలు బయలుదేరారు.

అయితే శనివారం రాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో సభా ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ భారీ కటౌట్ కుప్పకూలింది.అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేరు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సభను పురస్కరించుకొని రిహార్సల్స్ నిర్వహిస్తున్న కళాకారులు  ఉన్న కళాకారులంతా వర్షం తాకిడి తట్టుకోలేక ఒకాసారిగా సభా ప్రాంగణంలో తలదాచుకొన్నారు. 

loader