Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి కార్మికులకు కేసిఆర్ వరాల జల్లు

  • వారసత్వ ఉద్యోగాలను ఇంకో పద్ధతిలో ఇస్తాం
  • కారుణ్య నియామకాల కింద ఇస్తాం
  • ఉద్యోగం వద్దన్నవారికి 25లక్షల సొమ్ము
KCR announces slew of incentives to poll bound singareni workers

తెలంగాణ సిఎం కేసిఆర్ సింగరేణి కార్మికులపై వరాల జల్లు కురిపించారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

 

డిపెండెంట్ ఉద్యోగాలు వద్దే వద్దని 1998లో, 2002లో ఈ జాతీయ సంఘాలే బిఎంఎస్, ఐఎన్ టియుసి, టిఎన్టియుసి, సిఐటియు, ఎఐటియుసి కూడా సంతకాలు చేసినాయి.

డిపెండెంట్ ఉద్యోగాలు అడగం అని ఒప్పుకున్నదే ఈ సోకాల్డ్ జాతీయ సంఘాలే.

డిపెండెంట్ ఉద్యోగాలను అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

సింగరేణి కార్మికుల బతుకు దుర్భరంగా ఉంటది. ముందుగా నాకు కూడా తెలియదు. తెలంగాణ ఉద్యమానికి పొయ్యే క్రమంలో నేను వారి కష్టాలను తెలుసుకున్న.

గనుల్లో కార్మికులకు ఆక్సిజన్ అందదు.

మోకాలు చిప్పలు భయంకరంగా అరిగిపోతాయి.

గతంలో ఉన్న సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలను మేము పునరుద్ధరించినం. అయితే దాన్ని కోర్టు కొట్టేసింది. కోర్టుకుపోయిన పున్యాత్ములు ఎవరంటే వీళ్లే కాంగ్రెస్, టిడిపి వాళ్లే.

కొన్ని ముఠాలు ఏర్పడ్డాయి. ఏ పనిచేయాలన్న కోర్టుకు పోయి అడ్డుకునేందుకు. అందులో ఒక ముఠా వారు కాలేశ్వరం మీద 196 కేసులు వేశారు.

ఉద్యోగాల విషయంలో ఇంకో ఒక ముఠా ఉంది. ఆ ముఠా 17 కేసులేసింది.

డిపెండెంట్ అని పేరు పెడితే వద్దంటున్నాయి కోర్టులు. కారుణ్య నియామకాలు కేటగిరి కింద వద్దని ఏ కోర్టు చెప్పలేదు. కాబట్టి ఆ పద్ధతిలో ఇస్తాం.

ఊ అంటే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ముఠా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలని అనుకున్నాం.

డిపెండెంట్ వారి ప్రయోజనాలు వందశాతం రక్షిస్తాం. అవకాశాలు కల్పిస్తాం.

కారుణ్య నియామకాలు కింద వాటిని యదాతదంగా ఇప్పిస్తాం.

కారణ్యం కింద ఇవ్వాలంటే ప్రస్తతం ఐదారు జబ్బులే ఉన్నాయి. దానిలో... కానీ సింగరేణి కార్మికులకు వచ్చే జబ్బులన్నీ అందులో చేర్చుతాం. అలా 75 శాతం మందికి పైగా లబ్ధి చేకూరుతుంది.

కారుణ్యం కింద ఉద్యోగం రానివారికి గతంలో 5లక్షలు ఇస్తుండే. మేము దాన్ని 12.50 లక్షలు చేశాము. అది కాకుంటే నెలవారీగా సర్వీసు ఉన్నంతకాలం తీసుకోవచ్చు. దాన్ని 25లక్షలకు పెంచినం.

కంపంజెటరీ అపాయింట్మెంట్ కింద కొనసాగిస్తాం.

డబ్బు తీసుకుంటాం అనుకుంటే 25లక్షలు ఇస్తాం.

నెలసరి ఇచ్చే సాలరీ ని 12500 నుంచి 25వేలకు పెంచుతాం.

14 నుంచి 19వేల మంది  దొంగ పేరుతో అలియాస్ ఉద్యోగులు ఉన్నారు. ఆ దుస్థితికి కారణం ఇదే జాతీయ సంఘాల సాక్షిగా రాలేదా.? ఈ దందాలు చేయించింది ఈ సంఘాల వారే కదా?

వారందరికీ సొంత పేరు మీద ఉద్యోగాలు కల్పిస్తాం. 40, 50 రోజుల్లో కంప్లిట్ చేస్తం.

సింగరేణి కార్మికులకు కార్పొరేట్ వైద్యం కూడా అందుబాటులోకి తీసుకొస్తం. ఆరు లక్షల వరకు నయా పైసా వడ్డీ లేకుండా ఇండ్ల నిర్మాణం కోసం రుణం ఇస్తాం.

లాభాల్లో వాటాను పెంచింది టిఆర్ఎస్ గవర్నమెంటే. ఈరోజు అందజేస్తాం.

దసరా అడ్వాన్స్ 8వేలే ఇచ్చేవారు. మేము 25వేలకు పెంచినం.

వృత్తి పన్ను, ఆదాయ పన్ను రద్దు చేయాలని వారి డిమాండ్ ఉంది. 175 కోట్ల వృత్తి పన్ను రద్దు చేసినం. ఆదాయ పన్ను విషయంలో శాసనసభలో కేంద్రానికి పంపినం. కచ్చితంగా కేంద్రంపై పెద్ద యుద్ధం చేయబోతున్నాం.

ఇతర ఎంపిల మద్దతు కూడగట్టి యుద్ధం చేస్తాం.

Follow Us:
Download App:
  • android
  • ios