Asianet News TeluguAsianet News Telugu

హోంగార్డులకు కేసిఆర్ తీపి కబురు

  • నెల జీతం 20 వేలకు పెంపు
  • ఏటా వెయ్యి పెరిగేలా ప్లాన్
  • మార్చి 31 నుంచి పెంచిన జీతాలు అమలు చేస్తాం.
kcr announces good news for telangana home guards

తెలంగాణ హోంగార్డులకు సిఎం కేసిఆర్ తీపి కబురు అందించారు. హోంగార్డుల సమస్యలపై తెలంగాణలో తీవ్రమైన ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో సిఎం వరాలు కురిపించారు. ప్రగతిభవన్ లో బుధవాంర హోంగార్డులతో సమావేశమయ్యరు కేసిఆర్. ఈ సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సహ్మారెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనేక వరాలు గుప్పించారు కేసిఆర్.

హోంగార్డుల జీతాలను భారీగా పెంచుతూ కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. వారి జీతాన్ని 20వేలకు పెంచారు. వచ్చే మార్చి 31 నుంచి పెరిగిన జీతాలు అందుతాయని ప్రకటించారు. అలాగే ఏటా హోంగార్డులకు వెయ్యి రూపాయలు పెరుగుతాయని ప్రకటించారు. మార్చి 31 తర్వాత 20వేల జీతంతోపాటు మరో వెయ్యి కలిపి 21వేలు వస్తాయన్నారు.

తెలంగాణలో ఉన్న 18 వేల మంది హోంగార్డులకు వందకు వంద శాతం డబుల్ బెడ్రూముల ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. హోంగార్డులు కోరిన చోట వారికి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు హోంగార్డులను రెగ్యలర్ చేయడం సాధ్యం కాదని సిఎం అన్నారు. హోంగార్డుల రెగ్యులరైజేషన్ కోసం తాము పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో హోంగార్డులకు ఇచ్చే వాటాను భారీగా పెంచుతూ సిఎం నిర్ణయాన్ని ప్రకకటించారు.

తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు వారు రిక్రూట్ మెంట్ లో హోంగార్డులకు గతంలో 10 శాతం రిజర్వేషన్ వర్తింపజేసేవారు.. దాన్ని 25 శాతానికి పెంచుతూ నిర్ణయం ప్రకటించారు కేసిఆర్.

ఎఆర్ కానిస్టేబుళ్లుగా 5 శాతం హోంగార్డుల నుంచి తీసునేవారు ఇప్పుడు ఆ శాతాన్ని 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

సివిల్ పోలీసుల నియామకంలో 8 నుంచి 15 శాతానికి పెంచారు.

పిటిఓ డ్రైవర్లు నియామకంలో హోంగార్డులకు 2శాతమే ఉండగా దాన్ని 20 శాతానికి పెంచారు.

ఎస్పీఎఫ్ నియామకాల్లో 5 శాతం నుంచి 25 శాతానికి పెంపు

ఫైర్ డిపార్ట్మెంట్ లో 10 శాతం నుంచి 25 శాతం పెంపు

ఆర్మడ్ రిజర్వు ఫోర్స్ లో 5శాతం హోంగార్డులకు రిజర్వు ఉంది. 25 శాతానికి పెంచారు.

పోలీసు కమ్యూనికేషన్స్ లో 2శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం ప్రకటించారు.

ట్రాఫిక్ లో పనిచేసే కానిస్టేబుళ్లతో సమానంగా రిస్క్ అలవెన్స్ ను హోంగార్డులకు కూడా అమలు చేస్తామన్నారు.

మహిళా హోంగార్డులకు మహిళా పోలీసులతో సమానంగా మెటర్నిటీ లీవ్ లు అమలు చేస్తాం. మగ హోంగార్డులకు పెటర్నిటీ లీవ్స్ కూడా అమలు చేస్తామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios