హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్: ప్రకటించిన కేసీఆర్


హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ బరిలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు.

KCR announces Gellu Srinivas Yadav as Huzurabad bypoll candidate

హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ను టీఆర్ఎస్ బరిలోకి దింపనుంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆ సమయంలో  అరెస్టై జైలుకు వెళ్లాడు. ఓయూ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా కూడ ఆయన గతంలో పనిచేశాడు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నాడు.

&n

bsp;

 

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆయన స్వగ్రామం ఉంది. దీంతో ఈ నియోజకవర్గం నుండి ఆయనను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది.పార్టీ ఆవిర్భావం నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లోనే ఉన్నారని కేసీఆర్ గుర్తు చేశారు.ఉద్యమకాలంలో అరెస్టై జైలుకు వెళ్లిన విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో గుర్తు చేశారు. శ్రీనివాస్‌యాదవ్‌ది  క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వమని ఆయన చెప్పారు.ఈ స్థానం నుండి తొలిసారిగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. గతంలో ఈ స్థానం నుండి 2009 నుండి వరుసగా ఈటల రాజేందర్ పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ అభ్యర్ధిగా ఈ దఫా ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios