తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయం సందర్శించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తాను 50 ఏళ్ల క్రితం యాదాద్రికి వచ్చారని గుర్తు తెచ్చారు. ఈ ఆలయ పున:ప్రారంభానికి తేదీ ఖరారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణం చేపడతామని వివరించారు. దీనికి తొమ్మిది రోజుల ముందే అంకురార్పణ మొదలవుతుంది. 

హైదరాబాద్: యాదాద్రి ఆలయం సందర్శించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను 50ఏళ్ల క్రితం యాదాద్రికి కుటుంబంతో కలిసి వచ్చారని చెప్పారు. అప్పుడు నిర్మాణాలేవీ లేవని, ఆ మెట్లు ఎక్కుతూ పైనకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. ఇదే సందర్భంగా యాదాద్రి ఆలయ పున:ప్రారంభ ముహూర్తం తేదీని ఖరారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ చేపడతామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి తొమ్మిది రోజుల ముందే అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమవుతుందని వివరించారు. మహాకుంభ సంప్రోక్షణం కోసం మహాసుదర్శన యాగం చేస్తామని, ఇది నిర్విగ్నంగా సాగాలని చెప్పారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్ష ఎదుర్కొందని, ఆధ్యాత్మిక వివక్షనూ చవిచూసిందని తెలిపారు. అప్పుడు తెలంగాణలో పుష్కరఘాట్లు కూడా లేవని అన్నారు. తాను ఉద్యమ సమయంలో పుష్కరఘాట్లు నిర్మించాలని డిమాండ్ చేశారని చెప్పారు. తన డిమాండ్ల తర్వాతే తెలంగాణలో పుష్కర ఘాట్లు వెలిశాయని వివరించారు.

యాదాద్రి ఆలయం ఎప్పుడు ప్రారంభిస్తారని అందరూ అడుగుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే, ఆలయ ప్రారంభాలు మన చేతిలో ఉండవని చెప్పారు. అవి ఆగమ శాస్త్రాలను బట్టి నిర్ణయం జరుగుతుంటాయని వివరించారు. అయితే, ఆలయ ప్రారంభం తర్వాత కూడా పనులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు.. శ్రీ రామానుజ త్రిదండి చిన్నజీయర్ స్వామి వైష్ణవ మతాచార్యుడు కాబట్టి, ఆలయం కూడా వైష్ణవ శాఖకు చెందినది కాబట్టి.. ఆయన సూచనలతో జరగాలని నేను కోరాను. అందరితోనూ ఆయన సమావేశాలు జరిగిపి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఈ పద్ధతిలో జరపాలని సూచించారని, అందుకు అనుగుణంగానే నిర్మాణాలు జరిగాయని తెలిపారు.

తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉన్నదని సీఎం కేసీఆర్ వివరించారు. శైవులు, వైష్ణవులు అనే తేడా లేదా అన్ని రకాల శాఖలు, విశ్వాసులు ఇక్కడ నడయాడారని తెలిపారు. అందుకే అన్ని రకాల ఆలయాలు, ఆధ్యాత్మికత మన రాష్ట్రంలో ఉన్నదని వివరించారు. అంతేకాదు, అష్టాదశ పీఠం కూడా ఇక్కడ ఉన్నదని తెలిపారు. అష్టాదశలు ఉపవాసం చేసేవారు ప్రతి శక్తి పీఠం దగ్గర ఉపవాసం చేయాల్సి ఉంటుందని, అలాగైతేనే వారు ఉత్కృష్ట దశకు చేరుకుంటారని చెప్పారు. అలాంటి శక్తిపీఠం జోగులాంబ ఆలయమని వివరించారు. ఒకటి శ్రీలంకలో ఉన్నదని తెలిపారు. గతంలో జోగులాంబ అమ్మ శక్తి పీఠం గురించి అప్పుడు ప్రచారం చేయలేదని అన్నారు.

స్వయంభుగా వెలసిన లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం గొప్పగా ఉంటుందని సీఎం కేసీఆర్ వివరించారు. తాను 1969లో తిరుమలకు వెళ్లినప్పుడు అక్కడ అభివృద్ధి అంతంతగానే ఉందని అన్నారు. కృష్ణదేవరాయలు కట్టిన ధర్మశాలల్లోనే ఉన్నారని, కానీ, ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.