తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లు శుక్రవాం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న జల వివాదాలతో పాటు మరికొన్ని అంశాలపై నేతలిద్దరూ చర్చించనున్నారు. 
అజెండా ఇదే: 

1. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలింపు
2. పెండింగ్‌లోని విభజన అంశాలపై చర్చ
3. 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన
4. విద్యుత్ బకాయిల వివాదాలపై చర్చ
5. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై చర్చ
6. సొంత రాష్ట్రాలకు ఉద్యోగులను తీసుకురావడం

ఇప్పటికే అమరావతి నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ .. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అవుతారు.