తెలంగాణలో పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్ పోరును మరింత ఉధృతం చేసింది.  ఈ క్రమంలోనే రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా దీక్ష చేపట్టింది.

తెలంగాణలో పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్ పోరును మరింత ఉధృతం చేసింది. గత కొన్ని రోజులు నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా దీక్ష చేపట్టింది. కొద్దిసేపటి క్రితం ఈ నిరసన ప్రారంభమైంది. ఈ నిరసన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ హాజరయ్యారు. స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్థూపానికి, మ‌హాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు కేసీఆర్ నివాళుల‌ర్పించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి కేసీఆర్ పుష్పాలు స‌మ‌ర్పించారు.

ఈ దీక్ష‌లో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు నాయ‌కులు పాల్గొన్నారు. ఇందుకోసం తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం సేక‌ర‌ణ‌లో ఒకే విధానం ఉండాల‌నే టీఆర్‌ఎస్ డిమాండ్‌ చేస్తుంది.