నిజామాబాద్ ఎంపీ కవిత పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమెకు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానని  కేసీఆర్ పేర్కొన్నారు. 

ఎంపీ కవితకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, ఆరోగ్యం, శాంతితో ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొన‌సాగాల‌ని కేటీఆర్ ఆశీర్వ‌దించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జాప్ర‌తినిధులు కూడా క‌విత‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.