కవిత అరెస్ట్.. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం.. (వీడియో)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Kavithas arrest. KTR gets into an argument with ED officials (Video)..ISR

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నేటి మధ్యాహ్నం నుంచి ఈడీ ఆమె ఇంట్లో సోదాలు జరుపుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందం.. హైదరాబాద్ బంజారాహిల్స్ ఉన్న ఉన్న ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. 

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఢిల్లీకి తీసుకెళ్లనున్న ఈడీ అధికారులు..

మొత్తంగా 12 మంది అధికారులు 4 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. సాయంత్రం వరకు ఈ రైడ్ కొనసాగింది. అయితే సాయంత్రం సమయంలో ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆమెను అరెస్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కాగా.. కవిత అరెస్ట్ విషయం తెలియడంతో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, అలాగే మరో మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన కవిత నివాసానికి చేరుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. స్థానిక మెజిస్ట్రేట్ కు సమాచారం ఇవ్వకుండా.. ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారులు కూడా ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ సమయంలో హరీశ్ రావు కూడా పక్కనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios