తీహార్ జైలులో కల్వకుంట్ల కవితకు అస్వస్థత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు.

Kavitha Kalvakuntla Falls Ill in Tihar Jail Amid Delhi Liquor Scam Arrest  GVR

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న భారత్‌ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు అనారోగ్యం బారిన పడ్డారు. తీహార్‌ జైలులో ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో న్యూఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. తీహార్ జైలులో కవిత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వైద్యం అందించేందుకు జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. 

కల్వకుంట్ల కవిత ఈ ఏడాది మార్చి 15న మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు. అప్పటి నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును మొదట సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆ తరువాత సీబీఐ జారీ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. 2024 మార్చి 15న బంజారాహిల్స్‌లోని నివాసం నుంచి కవితను ఈడీ అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించింది. 

కాగా, కొద్ది రోజుల క్రితమే కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, తదితరులు జైలులో కలిశారు. అంతకుముందు బీఆర్ఎస్ మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా జైలులో కవితతో ములాఖత్ అయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios