Asianet News TeluguAsianet News Telugu

రూ.3250 కోట్ల మోసం: నాంపల్లి కోర్టులో కార్వీ కేసుపై చార్జీషీట్ దాఖలు

కార్వీ సంస్థ రూ.3250 కోట్ల మోసాలకు పాల్పడిందని పోలీసులు పేర్కొన్నారు. నాంపల్లి కోర్టులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు.ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.. కస్టమర్ల షేర్లను తాకట్టు పెట్టి రూ.720 కోట్లకు ఇతర సంస్థలకు మళ్లించారని పోలీసులు చార్జీషీట్ లో గుర్తించారు.

Karvy case:Police files Chargesheet in Nampally Court
Author
Hyderabad, First Published Dec 15, 2021, 10:46 AM IST

హైదరాబాద్: కార్వీ సంస్థ  రూ. 3250 కోట్ల  మోసాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు Nampally Courtలో పోలీసులు Charge Sheet దాఖలు చేశారు. కస్టమర్ల షేర్లను తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి రుణాలు తీసుకొన్నారనే కేసులో Karvy సంస్థ ఎండీ parthasarathy ని పోలీసులు అరెస్ట్ చేశారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో కార్వీ సంస్థ ఎండీ పార్థసారథిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భాగంగానే పార్థసారథి ప్రస్తుతం Banglore జైల్లో ఉంటున్నాడు. 

also read:కార్వీకి ఈడీ షాక్.. స్టాక్ మార్కెట్‌లోని రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్

కార్వీ సంస్థ రూ.3250 కోట్ల మోసానికి పాల్పడిందని చార్జీషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఐదు వేల పేజీల చార్జీషీట్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో అందించారు. షేర్లను తాకట్టు పెట్టి కార్వీ సంస్థ బ్యాంకుల నుండి రుణాలు పొందింది. సుమారు ఎనిమిదేళ్ల నుండి ఈ సంస్థ పలు Bank ల నుండి రుణాలు పొందిందని పోలీసులు చార్జీషీట్‌లో తెలిపారు. కార్వీ సంస్థ తమ కస్టమర్ల షేర్లను రుణాలు తీసుకొన్నట్టుగా చార్జీషీట్ లో పోలీసులు వివరించారు. కస్టమర్ల షేర్లలోని రూ. 720 కోట్లను ఇతర సంస్థలకు మళ్లించారని  చార్జీషీట్‌లో పోలీసులు వివరించారు.  రెండేళ్ల క్రితం కార్వీ సంస్థపై సెబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బ్యాంకుల నుండి తీసుకొన్నా రూ. 2800 కోట్లను  షెల్ కంపెనీలకు  కార్వీ సంస్థ మళ్లించిందని చార్జీషీట్ లో పోలీసులు గుర్తించారు. కార్వీ సంస్థ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.మూడు బ్యాంకులు, ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు పోలీసులు. బ్యాంకుల నుండి రూ. 1500 కోట్లను రుణాలను పొంది ఇతర సంస్థలకు మళ్లించినట్టుగా పోలీసులు గుర్తించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios