తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. 

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కె కేశవరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్‌ పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 

టీజీ లాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కే నష్టమనిఅన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీజీని అదుపులో ఉంచాలని సూచించారు. టీజీ వెంకటేష్‌ అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అంటూ అటువంటి పరిస్థితి రాకుండా ఉండేలా చూడాలని ఆయన చంద్రబాబును కోరారు.

 రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను కించపరచవద్దని ఆయన టీడీకి హితవు పలికారు. ప్రజలను రెచ్చగొట్టడమే టీజీ పరమావధిగా పెట్టుకున్నారని కర్నె మండిపడ్డారు.

టీజీకి పిచ్చి పట్టిందని ఆయన అన్నారు. ప్రజలను రెచ్చగొట్టాలని టీజీ వెంకటేష్‌ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.