కర్ణాటక ఎన్నికలు: టీఆర్ఎస్ ను కాపీ కొట్టిన బిజెపి

కర్ణాటక ఎన్నికలు: టీఆర్ఎస్ ను కాపీ కొట్టిన బిజెపి

హైదరాబాద్: బిజెపి తమను కాపీ చేస్తోందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బిజెపి ఎన్నికల ప్రణాళకలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ, అభివృద్ధి పథకాల హామీలు ఉన్నాయని ఆయన అన్నారు. 

ఆ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. బిజెపి కర్ణాటక ఎన్నికల కోసం తాము అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 

ఆ పథకాల జాబితా కూడా ఇచ్చారు. మిషన్ కాకతీయ మిషన్ కల్యాణిగా, కల్యాణి లక్ష్మి వివాహం మంగళ యోజనగా మారాయని ఆయన అన్నారు. లక్ష రూపాయల మేరకు రైతు రుణాల మాఫీకి కూడా బిజెపి హామీ ఇచ్చిందని చెప్పారు. 

టీఎస్ ఐపాస్ పరిశ్రమలకు సింగిల్ విండో క్లియరెన్స్ గా బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో చేర్చిందని ఆయన చెప్పారు. టీ హబ్ స్ఫూర్తితో కె హబ్ ను బిజెపి హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అన్నపూర్ణ స్ఫూర్తితో ముఖ్యమంత్రి అన్నపూర్ణ క్యాంటీన్లను కర్ణాటక బిజెపి హామీ ఇచ్చిందని చెప్పారు. 

పేజీల కొద్దిగా కేటీఆర్ తమ పథకాలు బిజెపి ఎలా కాపీ కొట్టిందనే విషయాన్ని వివరిస్తూ వెళ్లారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos