కర్ణాటకలో హంగ్ లేదు కింగ్ లేడు.. అంతా తూచ్

karnataka elections big shock to jds
Highlights

జెడిఎస్ కు బిగ్ షాక్

కర్ణాటక ఎన్నికల హడావిడి మొదలైన నాటినుంచి హంగ్ రావొచ్చు. జెడిఎస్ కింగ్ అవుతుండొచ్చు అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బిజెపి, జెడిఎస్ కలిసి అధికారాన్ని పంచుకుంటాయని ఒక వాదన కూడా తెర మీదకు వచ్చింది. అంతెందుకు ఎగ్జిట్ పోల్స్ కూడా మెజార్టీ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందని ఇచ్చాయి. కొన్ని సంస్థలు మాత్రం హంగ్ వస్తుందని వెల్లడించాయి.

కానీ ఎగ్జిట్ పోల్స్ మరోసారి తలకిందులయ్యేలా కర్ణాటక ఫలితాలు వచ్చాయి. బిజెపి మ్యాజిక్ ఫిగర్ కు అతి దగ్గరగా చేరుకున్నది. అవసరమైతై స్వతంత్రుల మద్దతుతో బిజెపి అధికారాన్ని చేపట్టడం ఖాయంగా కనబడుతున్నది. మొత్తం 222 స్థానాలున్న కర్ణాటకలో బిజెపి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యతతో దూసుకుపోతున్నది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 113 స్థానాల్లో బిజెపి లీడింగ్ లో ఉండగా స్వతంత్రులు ముగ్గురు లీడ్ లో ఉన్నారు. అంటే స్వతంత్రంగానే బిజెపి సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చాన్స్ ఉంది. ఒకవేళ ఈ సంఖ్యలో అటూ ఇటూ మారినా స్వతంత్రుల మద్దతుతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చివరకు జెడిఎస్, కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు పార్టీ ఫిరాయించి మద్దతిస్తే బిజెపి సర్కారు కొలువుదీరే చాన్స్ ఉంటుంది.

అయితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఆశలు గల్లంతయినట్లే కనబడుతున్నాయి. ఆ పార్టీ 60 దగ్గర ఆగిపోయిన పరిస్థితి కనబడుతున్నది. ఇక జెడిఎస్ కొద్దిగా పుంజుకున్నా.. 46 దగ్గర ఆగిపోయే వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో హంగ్ అని కింగ్ అని జరిగిన ప్రచారమంతా తూచ్ అని కర్ణాటక ఓటర్లు తీర్పు వెలువరించారు. ఇక జెడిఎస్ అధికార శిబిరానికి దూరంగా ఉంటుందా.? లేక ప్రతిపక్షంలో కూర్చుంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇక హంగ్, కింగ్ అన్న ధీమాను జెడిఎస్ కోల్పోయిన పరిస్థితి మాత్రం ఉంది.

loader