Asianet News TeluguAsianet News Telugu

మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్ర పోగలదా : డీకే శివకుమార్ వ్యాఖ్యలు

తెలంగాణ సమాజం మార్పు కోసం చూస్తోందన్నారు కేపీసీసీ అధ్యక్షుడు , కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తెలంగాణకు మేం డబ్బులు పంపిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని.. మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్ర పోతుందా అని డీకే శివకుమార్ ప్రశ్నించారు. 

karnataka dy cm dk shivakumar fires on brs leaders ksp
Author
First Published Nov 10, 2023, 4:44 PM IST

తెలంగాణ సమాజం మార్పు కోసం చూస్తోందన్నారు కేపీసీసీ అధ్యక్షుడు , కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను ఆయన శుక్రవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి డీకే రోడ్డు మార్గాన కోదాడ , హుజూర్ నగర్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సోనియాకు కృతజ్ఞతలు తెలపాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.

కేసీఆర్ ఫాంహౌజ్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని డీకే చురకలంటించారు. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. తన పేరుతో నకిలీ లెటర్ సృష్టించారని.. కర్ణాటకలో ఫేక్ లెటర్‌పై ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. తెలంగాణకు మేం డబ్బులు పంపిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని.. మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్ర పోతుందా అని డీకే శివకుమార్ ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios