Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బండి సంజయ్.. సోషల్ మీడియాలో జోరందుకున్న ప్రచారం, ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా వున్న సునీల్ దేవధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించడం దీనికి బలం చేకూరుస్తోంది. 

karimnagar mp bandi sanjay likely to be bjp incharge of ap ksp
Author
First Published Jul 30, 2023, 2:44 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఎంపీ బండి సంజయ్‌కి ఎలాంటి పదవి కేటాయించలేదు అధిష్టానం. దీనిపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్ధితుల్లో రెండ్రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇదే సమయంలో సంజయ్ గురించి సోషల్ మీడియాలో కీలక ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బండిని నియమించనున్నారన్నది దాని సారాంశం. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా వున్న సునీల్ దేవధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించడం దీనికి బలం చేకూరుస్తోంది. 

Also Read: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి.. జాతీయ ఉపాధ్యాక్షురాలిగా డీకే అరుణ కొనసాగింపు..

ఈ పరిణామాలు నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ స్థానంలో మరో నాయకుడిని నియమించాల్సి వుంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనదగ్గ నేత లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో సంజయ్‌కి కనుక పగ్గాలు అప్పగిస్తే మంచిదేననే చర్చ పార్టీలో జరుగుతోంది. మరి ఇది గాలివార్తా లేక దీనిపై ఢిల్లీ పెద్దల నుంచి లీకులు వచ్చాయా అంటూ ప్రచారం జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios