Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : కరీంనగర్ కలెక్టర్, సీపీపై ఈసీ వేటు

కరీంనగర్ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమీషనర్‌పై వేటు పడింది. కలెక్టర్ గోపీ, సీపీ సుబ్బారాయుడును బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

karimnagar collector and police commissioner transfered by Election commission ksp
Author
First Published Oct 27, 2023, 7:01 PM IST

కరీంనగర్ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమీషనర్‌పై వేటు పడింది. కలెక్టర్ గోపీ, సీపీ సుబ్బారాయుడును బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచే ఈసీ కొరడా ఝళిపించడం ప్రారంభించింది. ఇప్పటికు భారీగా కలెక్టర్లు, ఎస్పీలు ఇతర అధికారులను బదిలీ చేసింది. వీరిలో నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం పోలీస్ కమీషనర్లు, పది మంది ఎస్పీలు, అబ్కారీ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్, రవాణా శాఖ కార్యదర్శి వున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios