సిపిఎం స్టయిల్ ఇదేనంటున్న ప్రకాష్ కారత్

సిపిఎం స్టయిల్ ఇదేనంటున్న ప్రకాష్ కారత్

దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. అందులో ఏ పార్టీ స్టయిల్ ఆ పార్టీదే. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఎవరి స్టయిల్ లో వారు నడుచుకుంటారు. అయితే వామపక్ష పార్టీలు కూడా దేశంలో చాలానే ఉన్నాయి. వాటిలోనూ ఎవరి స్టయిల్ వారిదే. ఇక సిపిఎం స్టయిల్ ఎలా ఉంటుందో ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ హైదరాబాద్ లో మీడియాతో వివరించారు. ఆయన ఏమన్నారో చదవండి.

జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం పై చర్చ ముగిసింది. చర్చ సందర్భంగా వచ్చిన  సవరణలు పై ఓటింగ్ జరుగుతుంది. అనంతరం రాజకీయ ముసాయిదా ను నిర్ణయిస్తాము. దీనిపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఓటింగ్ నిర్వహించి తుది ముసాయిదా ను ప్రకటిస్తాము. మాపార్టీ  రాజ్యాంగం ప్రకారం రహస్య ఓటింగ్ ఉండదు. అంత బహిరంగ ఓటింగే ఉంటుంది. పార్టీలో విభేదాలున్నాయన్నది కేవలం భ్రమే. పార్టీలో చీలికలు అన్న ప్రశ్నే ఉత్పన్నం  కాదు.

పార్టీలో ఏ అభిప్రాయం అయినా పారదర్శకంగా చర్చ ఉంటుంది. ఇందులో రహస్యం ఏమీ ఉండదు. ఓటింగ్ కు ఏ సభ్యుడయినా డిమాండ్ చేయవచ్చు. ఓటింగ్ కు వెళ్లిన తరువాత తీసుకున్న నిర్ణయం పార్టీలో అందరూ పాటిస్తారు. అప్పుడు మెజారిటీ, మైనారిటీ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాజకీయ తీర్మానం పై తుది నిర్ణయం ఈ రాత్రికి తీసుకునే అవకాశం ఉంది.

 సెంట్రల్ కమిటీ కంటే పార్టీ కాంగ్రెస్ ఉన్నతమైనది. కీలక అంశాలపై ఇక్కడ స్పష్టమైన ముగింపు ఉంటుంది. ఇప్పటి వరకు ఏనాడూ రహస్య ఓటింగ్ జరగలేదు. తీర్మానాల సమయంలో నిర్ణయాలు కీలకంగా ఉంటాయి గాని మైనారిటీ, మెజారిటీ అంశం ప్రధానం కాదు. గత సమావేశంలో 5 అంశాలపై ఓటింగ్ జరిగింది. ఓటింగ్ అన్నది ఒక అంశం. దీనిపై ఊహాగానాలు అవసరం లేదు.

 15వ ఫైనాన్స్ కమిషన్ పై తీర్మానాలు వచ్చాయి. ఇప్పటికే దీనిపై వ్యతిరేకత ఉంది. దక్షిణాది రాష్ట్రాలో చర్చ అధికంగా ఉంది. 15 ఆర్దిక సంఘం నిధుల కేటాయింపుల్లో కూడా  1971 జనాభా లెక్కల ప్రాతిపదిక తీసుకోవాలని వత్తిడి పెరుగుతోంది. ఇప్పుడున్న నిధుల కేటాయింపు విధానంలో జనాభా నియంత్రణను గట్టిగా అమలుపరిచిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం ఉంది.

ఈ మీడియా సమావేశంలో తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page