తెలంగాణలోని కౌలు రైతులకు దళిత మేధావి కంచ ఐలయ్య ఓ చిట్కా చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలోని కౌలు రైతులకు దళిత మేధావి కంచ ఐలయ్య ఓ చిట్కా చెప్పారు. రైతు బంధు పథకం కింద పెట్టుబడి వ్యయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కౌలు రైతులకు ఇవ్వబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ పెట్టుబడి వ్యయాన్ని పొందే చిట్కాను కౌలు రైతులకు ఆయన చెప్పారు. కౌలు రైతులు తాము చెల్లించే కౌలులో ఎకరాకు రూ.4వేలు తక్కువ చెల్లించాలని ఆయన సూచించారు. కౌలు రైతులకు రైతుబంధు చెక్కులు ఇవ్వమని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, అందుకే కౌలు రైతులు తాము కట్టే కౌలును తగ్గించి ఇవ్వాలని సూచించారు.
ఒకప్పుడు పేదలకు కమ్యూనిస్టులు పంచిన భూములు ఇప్పుడు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. దళితులు, రజకులు, ఇతర కులాలకు అతి తక్కువ భూమి ఉందని చెప్పారు.
