Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి మాస్టర్ ప్లాన్: నేడు అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతు జేఏసీ భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయమై  జిల్లా కలెక్టర్  జితేష్ పాటిల్  చేసిన ప్రకటన విషయమై ఏం చేయాలనే దానిపై  రైతు జేఏసీ ప్రతినిధులు  ఇవాళ సమావేశం కానున్నారు. 

Kamareddy  Master  Plan:Farmers JAC  To meet today  at  Adloor  Yellareddy
Author
First Published Jan 8, 2023, 9:38 AM IST

నిజామాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్  విషయమై  ఏం చేయాలనే  విషయమై  రైతు జేఏసీ నేతలు  ఆదివారం నాడు  సమావేశం  కానున్నారు.  కామారెడ్డి  మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని  కలెక్టర్ జితేష్ పాటిల్  శనివారం నాడు ప్రకటించారు.  తమకు  ఏమైనా అభ్యంతరాలుంటే   ప్రభుత్వానికి  సమర్పించాలని కలెక్టర్  కోరారు.  ఇదే విషయాన్ని   కామారెడ్డి ఎమ్మెల్యే  గంగ గోవర్ధన్ కూడా  ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ పరిణామాల నేపథ్యంలో  మాస్టర్ ప్లాన్  పై ఏం చేయాలనే విషయమై  రైతు జేఏసీ ప్రతినిధులు సమావేశం  కావాలని నిర్ణయం తీసుకున్నారు.  జిల్లాలోని అడ్లూరు ఎల్లారెడ్డిలో  రైతు జేఏసీ ప్రతినిధులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.  కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  విషయమై  కలెక్టర్  చేసిన ప్రకటనకు సంబంధించి  జీవోను విడుదల చేయాలని రైతు జేఏసీ ప్రతినిధులు డిమండ్  చేస్తున్నారు.  

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఈ నెల  5వ తేదీన కలెక్టరేట్  ముందు  ఏడు గ్రామాల రైతులు ఆందోళన  నిర్వహించారు. ఈ ఆందోళనలకు  బీజేపీ, కాంగ్రెస్ లు  మద్దతు ప్రకటించాయి.  ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది.  కలెక్టర్ కు వినతిపత్రం సమర్పిస్తామని  రైతులు  పట్టుబడ్టారు.  అయితే రైతుల వద్దకు కలెక్టర్ వెళ్లలేదు. దీంతో  కలెక్టర్ దిష్టిబొమ్మకు  వినతి పత్రం సమర్పించారు.  అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో  రైతులు  మరింత  ఆగ్రహం వ్యక్తం  చేశారు.  మాస్టర్ ప్లాన్ కారణంగా  తమ భూములు కోల్పోయే పరిస్థితి నెలకొందని  రైతులు  ఆందోళన చెందుతున్నారు.  తమ కుటుంబ సభ్యులతో కలిసి  రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. 

ఈ ఆందోళనలో  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  మాజీ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్ రెడ్డి  పాల్గొన్నారు.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్  ముసాయిదా  మాత్రమేనని  మంత్రి కేటీఆర్  ప్రకటించారు. ఈ విషయాన్ని  స్థానిక రైతులకు  ఎందుకు  చెప్పలేకపోయారని మున్సిపల్  కమిషనర్ ను కేటీఆర్  ప్రశ్నించారు.

also read:కామారెడ్డి ఘటన.. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు 8 మందిపై కేసు..!

 మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ  ఈ నెల  6వ తేదీన  కామారెడ్డి బంద్  నిర్వహించారు.  ఈ బంద్ కు బీజేపీ, కాంగ్రెస్ లు మద్దతు ప్రకటించాయి.    మాస్టర్ ప్లాన్ లో  భూమి కోల్పోతామనే  ఆవేదనతో  ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబాన్ని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ ఈ నెల  6వ తేదీన పరామర్శించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios