Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి మాస్టర్ ప్లాన్: ఈ నెల 20న ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి రైతు జేఏసీ నిర్ణయం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఈ నెల  20వ తేదీన  ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించాలని  రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది.  కౌన్సిలర్లు  రాజీనామాలు చేయాలని మరోసారి జేఏసీ నేతలు కోరారు. 
 

Kamareddy Master Plan:Farmers JAC Decided To Protest In Front of MLA House
Author
First Published Jan 17, 2023, 3:20 PM IST

కామారెడ్డి:కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ  ఈ నెల  20వ తేదీన  ఎమ్మెల్యే  ఇంటిని ముట్టడించాలని   రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది.   పాత రాజంపేట పోచమ్మ ఆలయం వద్ద రైతు జేఏసీ నేతలు  సమావేహయ్యారు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకొనే వరకు ఆందోళనను కొనసాగించాలని  నిర్ణయం తీసుకున్నారు.  ఈ నెల  19వ తేదీ వరకు  విలీన గ్రామాలకు చెందిన  కౌన్సిలర్లు రాజీనామాలు సమర్పించాలని   రైతు జేఏసీ  కోరింది. రైతు జేఏసీ డిమాండ్  మేరకు  ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామాలు సమర్పించారు.  మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఈ నెల  20న ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించాలని  రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోనేవరకు  ఆందోళనను కొనసాగించాలని  జేఏసీ నిర్ణయం తీసుకుంది.  

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఈ నెల  5వ తేదీన  కలెక్టరేట్ ముందు  ఆందోళన నిర్వహించారు రైతు  జేఏసీ నేతలు . ఈ నెల  6వ తేదీన  కామారెడ్డి బంద్ నిర్వహించారు.ఈ రెండు ఆందోళనలకు  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి.  ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్ రెడ్డి  కూడా ఈ ధర్నాలో పాల్గొని తన మద్దతు ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ కామారెడ్డి రైతు జేఏసీ ఆందోళనలు నిర్వహిస్తుంది.  ఈ నెల  4వ తేదీన  అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు రాములు మృతి చెందారు.  మాస్టర్ ప్లాన్ లో తన భూమి కోల్పోతాననే ఆవేదనతో  రాములు మృతి చెందాడని  రైతు జేఏసీ  నేతలు చెబుతున్నారు. రాములు  మృతికి  మాస్టర్ ప్లాన్ కారణం కాదని  కలెక్టర్  జితేష్ పాటిల్ ప్రకటించారు. 

also read:కామారెడ్డి మాస్టర్ ప్లాన్: భవిష్యత్తు కార్యాచరణపై రైతు జేఏసీ భేటీ

మాస్టర్ ప్లాన్  కేవలం ముసాయిదా  మాత్రమేనని  జిల్లా కలెక్టర్  ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలుంటే  రాతపూర్వకంగా ఇవ్వాలని కూడా  ఆయన  కోరారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా  ప్రకటించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతు జేఏసీ నేతలు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios