Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా : స్వతంత్ర అభ్యర్ధికి షాక్.. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం

నిజామాబాద్  జిల్లా స్థానిక సంస్థల కోటా (nizamabad local body quota ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో (mlc elections) టీఆర్ఎస్ (trs) అభ్యర్ధి కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీనివాస్ (srinivas) వేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

kalvakuntla kavitha unanimously elected as mlc in nizamabad local body quota
Author
Hyderabad, First Published Nov 24, 2021, 2:30 PM IST

నిజామాబాద్  జిల్లా స్థానిక సంస్థల కోటా (nizamabad local body quota ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో (mlc elections) టీఆర్ఎస్ (trs) అభ్యర్ధి కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీనివాస్ (srinivas) వేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ స్థానానికి రెండే నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనిపై అధికారులు ప్రకటించానున్నారు. 

అంతకుముందు నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్‌ను బలపరుస్తూ తాము సంతకాలు చేయలేదంటున్నారు ఎంపీటీసీ, కార్పొరేటర్‌. అంతేకాదు తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి వీరు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

ALso Read:మళ్లీ ఎమ్మెల్సీ బరిలో కవిత.. మద్యాహ్నం నిజామాబాద్ లో నామినేషన్ దాఖలు...

కాగా.. ఇటీవల రాజ్యసభ సభ్యుడు Banda Prakash ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో... ఆయన స్థానంలో కవితను పంపిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టిఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు తెరదించుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరునే ఖరారు చేసింది. కాగా,  సోమవారం వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి,  ఖమ్మం నుంచి తాత మధుసూదన్ నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలినవాళ్ళు చివరి రోజైన మంగళవారం  నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 26 వరకు ఉపసంహరణ అవకాశం ఉంది. డిసెంబర్ 10న  పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 

ఎమ్మెల్యే కోటా లో ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవం అయిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సభ్యులకు సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది.  మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, రవీందర్, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి లు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios