మళ్లీ ఎమ్మెల్సీ బరిలో కవిత.. మద్యాహ్నం నిజామాబాద్ లో నామినేషన్ దాఖలు...

ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో... ఆయన స్థానంలో కవితను పంపిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టిఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు తెరదించుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరునే ఖరారు చేసింది. 

MLC Kavitha to file nomination as MLC Nizamabad today, telangana

తెలంగాణలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది.  లోకల్ బాడీ  ఎమ్మెల్సీల నామినేషన్లకు గడువు  ఇవాళ్టితో పూర్తవుతుంది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కొక్కరిగా ఇవ్వాళ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.  Nizamabad లో ఇవాళ ఎమ్మెల్సీగా కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1:45 నిమిషాలకు కవిత నామినేషన్ వేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్సీ బరిలో నిలవాలని నిర్ణయించింది. డిసెంబర్ 10న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

సీఎం కేసీఆర్ కూతురు, సెట్టింగ్ ఎమ్మెల్సీ Kalvakuntla Kavitha మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. నిజామాబాద్ జిల్లా Candidate of local bodiesగా ఆమె మళ్లీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు కవిత అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది.  మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కవిత ప్రస్తుత Council membership త్వరలో ముగియనుండగా.. మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవల రాజ్యసభ సభ్యుడు Banda Prakash ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో... ఆయన స్థానంలో కవితను పంపిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టిఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు తెరదించుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరునే ఖరారు చేసింది. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరాదని బిజెపి నిర్ణయించగా,  కాంగ్రెస్ మాత్రం కొన్ని చోట్ల పోటీ చేయాలని మరికొన్నిచోట్ల దూరంగా ఉండాలని యోచిస్తోంది.  నిజామాబాదు లో Congress ఒకవేళ పోటీ చేసిన సభ్యుల పరంగా టిఆర్ఎస్ కు భారీ మెజారిటీ ఉండడంతో కవిత విజయం సులభం కానుంది. ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో హైడ్రామా నడిచింది.

రవిశంకర్ గురూజీని కలిసిన బిజెపి ఎమ్మెల్యే ఈటల... గంటసేపు భేటీ... అందుకోసమేనా?

సిట్టింగ్ ఎమ్మెల్సీ Kuchukulla Damodar Reddyకి రెన్యువల్ దక్కదని,  గాయకుడు  సాయి చందును టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తుందని వార్తలు వచ్చాయి.  దీంతో కూచుకుళ్ల .. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన సమయంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ కు గుర్తు చేసి  రెన్యువల్ పొందారు. కాగా,  సోమవారం వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి,  ఖమ్మం నుంచి తాత మధుసూదన్ నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలినవాళ్ళు చివరి రోజైన మంగళవారం  నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 26 వరకు ఉపసంహరణ అవకాశం ఉంది. డిసెంబర్ 10న  పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 

ఎమ్మెల్యే కోటా లో ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవం అయిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సభ్యులకు సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది.  మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, రవీందర్, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి లు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంబంధిత అధికారుల నుంచి తీసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios