నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఓటమి పాలవ్వడంపై టీఆర్ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన జీవితం ప్రజలకే అంకితమన్నారు.

ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు.. ఎన్నికల్లో గెలుపొందిన అర్వింద్‌కు శుభాకాంక్షలు.. నా గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కవిత ట్వీట్ చేశారు.

రైతులు పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచిన ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కవితపై బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ 62 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఓడిపోవడంతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.